శ్రీ రాజా రెడ్డి గారు గణితశాస్త్ర అధ్యాపకులు NEET 2026 మాక్ టెస్ట్ ప్రమోషన్ వీడియోను ప్రారంభించారు
| Posted On 14 Apr 2026
స్థలం: రెడ్డీస్ కాలనీ, మదనపల్లి, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా
తేదీ: 14 ఏప్రిల్ 2026
గుడ్ మార్నింగ్ టు ఆల్,
ఈరోజు ఉదయం 11:30 గంటలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మదనపల్లి పట్టణంలోని రెడ్డీస్ కాలనీలో నివసిస్తున్న గౌరవనీయులు శ్రీ రాజా రెడ్డి గారు, గణితశాస్త్ర అధ్యాపకులు, వారి చేతుల మీదుగా NEET 2026 మాక్ టెస్ట్ కు సంబంధించిన English Version ప్రమోషన్ వీడియోను, అలాగే తిరుమల రెడ్డి గారి కృష్ణారెడ్డి గారు (ఉపాధ్యాయుడు, అరికల, పుంగనూరు మండలం), రాయల మల్లికార్జున గారు (ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మదనపల్లి), సదుం శ్రీనివాసులు గారు (ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మదనపల్లి) కలిసి రూపొందించిన తెలుగు వర్షన్ వీడియోలను ప్రారంభించడం మాకు ఎంతో ఆనందాన్ని మరియు గౌరవాన్ని కలిగిస్తున్నది.
విద్యార్థులకు తల్లిదండ్రులతో పాటు గురువులు కూడా అత్యంత ముఖ్యమైన మార్గదర్శకులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో గురువులు పాటించే క్రమశిక్షణ, మంచి అలవాట్లు మరియు కష్టపడే తత్వం విద్యార్థులపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వారి అంకితభావం విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి, వారి జీవితాలకు సరైన దిశను నిర్దేశిస్తుంది.
ప్రతి విద్యార్థి జీవితంలో అనేకమంది గురువులు విద్యను బోధిస్తారు. అయితే కొంతమంది మాత్రమే తమ బోధనతో పాటు తమ జీవన విధానంతో కూడా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసి నిజమైన మార్గదర్శకులుగా నిలుస్తారు. నా కళాశాల విద్య సమయంలో మూడు సంవత్సరాల పాటు గణితశాస్త్రాన్ని మాత్రమే కాకుండా, మా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గౌరవనీయులైన శ్రీ రాజా రెడ్డి గారి ప్రభావం ఎంతో విశిష్టమైనది.
గౌరవనీయులైన శ్రీ రాజా రెడ్డి గారి వద్ద నేను విద్యార్థిగా బి.ఎస్సి చదివిన సమయంలో, వారి సేవాభావం మరియు నిబద్ధతను దగ్గరగా గమనించే అవకాశం నాకు లభించింది. నాకు తెలిసిన సమాచారం మేరకు, మూడు దశాబ్దాలకు పైగా మదనపల్లి మరియు పరిసర ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి ధనాపేక్ష లేకుండా తన విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తన బాధ్యతలను వందకు వంద శాతం నిబద్ధతతో నిర్వర్తించారు.
ఆయన సేవలు మదనపల్లి ప్రాంతానికి మాత్రమే కాకుండా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు పరిసర రాష్ట్రాలైన కర్ణాటక రాష్ట్రంలో కూడా విస్తరించాయి. సార్ గారి సేవలను అందుకోవడానికి అనేక కళాశాలలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది అంటే, గణితశాస్త్రంపై ఆయనకు ఉన్న నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం విద్యార్థుల కోసం మూడు నుండి నాలుగు గంటలపాటు నిరంతరంగా ట్యూషన్లు బోధిస్తూ, కళాశాలలో తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.
అనేక మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, కేంద్రీయ పరిశోధనా సంస్థల్లో, సాఫ్ట్వేర్ రంగంలో మరియు విదేశాల్లో ఉద్యోగాలు సాధించడంలో గౌరవనీయులైన శ్రీ రాజా రెడ్డి గారి కృషి ప్రధాన కారణంగా నిలిచింది. ఆయన చేసిన సేవలు విద్యార్థుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కొనసాగుతున్నాయి.
చివరిగా, www.mpcexams.com వెబ్సైట్ను స్థాపించి జాతీయ స్థాయిలో విద్యార్థులకు పోటీ పరీక్షల సేవలను అందించే స్థాయికి మా జీవితాలను ప్రభావితం చేసిన గౌరవనీయులైన శ్రీ రాజా రెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ గారి ఆదర్శ జీవితం మాకు స్ఫూర్తిగా నిలిచి, ఈ జాతీయ స్థాయి పోటీ పరీక్షలను విద్యార్థులకు అందించగలుగుతున్నాము.
Thank you, Sir.
Sincerely,