గౌరవనీయులు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి శ్రీ దామా శేషాద్రి నాయుడు గారి Moral Support
| Posted On 17 Apr 2026
From:
దామా శేషాద్రి నాయుడు
విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి
ముంబై, ఇండియా
Date: 14 April 2026
Place: న్యూఢిల్లీ
To:
శ్రీలక్ష్మి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్
www.mpcexams.com
మంచిగుంటపల్లి గ్రామం, మదనపల్లి
అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా
విషయం: విద్యార్థుల కోసం www.mpcexams.com నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేయుటకు.
మహోదయులకు,
2025 డిసెంబర్ 6వ తేదీన శ్రీలక్ష్మి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో www.mpcexams.com అనే వెబ్‌సైట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లా, మదనపల్లి సమీపంలోని మంచిగుంటపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ రేళ రెడ్డప్ప, M.Sc., Ph.D. గారు మరియు వారి స్నేహితులు కలిసి ప్రారంభించిన విషయం తెలిసి నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఈ వెబ్‌సైట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం దేశంలోని అన్ని వర్గాల విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, ఐఐటి–జేఈఈ, నీట్, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ తదితర వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షలను అందించడం అనేది అత్యంత అభినందనీయమైన కార్యక్రమం.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి పరీక్షను కేవలం ఒక్క రూపాయి చొప్పున విద్యార్థులకు అందించేందుకు మీరు చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం మరియు ప్రతిభను పెంపొందించడానికి సహాయపడుతుంది.
ఈ సదవకాశాన్ని దేశంలోని అన్ని వర్గాల విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని, వివిధ ప్రవేశ పరీక్షలు మరియు ఉద్యోగ అవకాశాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో విజయం సాధించి, తమ లక్ష్యాలను చేరుకుంటారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.
అందువల్ల, www.mpcexams.com ద్వారా విద్యార్థుల అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ సేవలకు నేను నా నైతిక మద్దతు (Moral Support) ను తెలియజేస్తున్నాను. మీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూ మరింత మంది విద్యార్థులకు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నాను.
ధన్యవాదాలు.
భవదీయులు,
(సంతకం)
దామా శేషాద్రి నాయుడు
విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి
ముంబై, ఇండియా