మదనపల్లి DSP శ్రీ బుచ్చి రాజు Sir TSLPRB–2026 SI & CONS 54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టులును ప్రారంభి
| Posted On 13 Sep 2026
ప్రెస్ నోట్
మదనపల్లి, 12 సెప్టెంబర్ 2026
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB)–2026 SI & కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం 54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టులు ప్రారంభం
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB)–2026 SI & కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం WWW.MPCEXAMS.COM ఆధ్వర్యంలో రూపొందించిన 54 ఫుల్ లెంగ్త్ ఆన్లైన్ మాక్ టెస్టుల కార్యక్రమాన్ని మదనపల్లి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) గౌరవనీయులు శ్రీ బుచ్చి రాజు సార్ గారు ఈరోజు అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీ బుచ్చి రాజు సార్ గారు మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు వాస్తవ పరీక్షా విధానాన్ని ముందుగానే పరిచయం చేయడం, సమయపాలనతో పరీక్ష రాయడం, ప్రశ్నలను వేగంగా పరిష్కరించడం మరియు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడంలో ఇటువంటి ఆన్లైన్ మాక్ టెస్టులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
WWW.MPCEXAMS.COM వ్యవస్థాపకులు Dr. Reddappa Rella, M.Sc., Ph.D., Lecturer in Physics, Government Polytechnic, Kalikiri గారు రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేయడానికి ఆన్లైన్ పరీక్షా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం పట్ల డీఎస్పీ శ్రీ బుచ్చి బాబు గారు సంతోషం వ్యక్తం చేసి, Dr. Reddappa Rella గారిని అభినందించారు.
TSLPRB–2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రూపొందించిన ఈ కార్యక్రమంలో 54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టులు, తాజా కరెంట్ అఫైర్స్, ప్రతి పరీక్షను మూడుసార్లు రాసే అవకాశం, ప్రతి అటెంప్ట్‌కు డిజిటల్ ఈ-సర్టిఫికేట్, వివరణాత్మక సమాధానాలు మరియు మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్ వంటి వివిధ పరికరాల ద్వారా పరీక్షలు రాసే సౌకర్యం అందుబాటులో ఉంటాయి.
ఈ సందర్భంగా Dr. Reddappa Rella గారు మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థికి నాణ్యమైన ఆన్లైన్ ప్రాక్టీస్‌ను అందుబాటులోకి తీసుకురావడమేWWW.MPCEXAMS.COM ప్రధాన లక్ష్యమని తెలిపారు. అభ్యర్థులు మాక్ టెస్టులను సద్వినియోగం చేసుకుని తమ బలాలు, బలహీనతలను గుర్తించి, మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతలో పరీక్షపై అవగాహన, ఆత్మవిశ్వాసం మరియు పోటీ సామర్థ్యం మరింత పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
WWWMPCEXAMS.COM
24 × 7 Always With You – Your Success, Our Commitment
Dr. Reddappa Rella, M.Sc., Ph.D.
Lecturer in Physics, Government Polytechnic, Kalikiri
Founder – WWW.MPCEXAMS.COM
WhatsApp / Contact: 700 300 6500 [ VOICE CALLS NOT ALLOWED]